News March 3, 2025
జగిత్యాల: సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

ఈనెల 5 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలు సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లకు అనుమతి లేదన్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి మొత్తం 14,450 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు.
Similar News
News July 5, 2025
వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు

APలో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్తవి ఆగస్టులో పంపిణీ చేయనుంది. నేతల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్‌కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది.
News July 5, 2025
ఎన్టీఆర్: నకిలీ సర్టిఫికెట్ల కలకలం

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు ఏఎన్‌ఎంలు ప్రమోషన్ల కోసం నకిలీ క్లినికల్ టెస్టింగ్ సర్టిఫికెట్లు సమర్పించారు. నరసరావుపేటలోని ఓ కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేయకుండానే వీటిని పొందినట్లు వైద్యశాఖ గుర్తించింది. ఈ ఘటనపై కృష్ణా జిల్లా డీఎంహెచ్‌ఓ శర్మిష్ఠ ఏఎన్‌ఎంలకు నోటీసులు జారీ చేశారు. సదరు కాలేజీని సంప్రదించగా, ఈ సర్టిఫికెట్లు నకిలీవని తేలిందన్నారు.
News July 5, 2025
HYDలో అత్యధికంగా బియ్యం పంపిణీ

రాష్ట్రంలో మూడు నెలల సన్న బియ్యం పంపిణీ ముగిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 13,61,691 కార్డులు ఉండగా 14,25,303 మంది, HYDలో మొత్తం 6,47,282 కార్డులు ఉండగా 6,83,525 మంది బియ్యం తీసుకున్నారు. MDCLలో 112.66 శాతం, HYDలో 105.59 శాతం, RRలో 106.16 శాతం మంది బియ్యం తీసుకున్నారు. నగరంలో రేషన్ షాపులకు కేటాయించిన కార్డుల కంటే ఎక్కువ బియ్యం పంపిణీ జరిగింది. తిరిగి సెప్టెంబర్‌లో పంపిణీ చేయనున్నారు.