News March 3, 2025

WGL: మక్కలు, పల్లికాయ ధరలు ఎలా ఉన్నాయంటే?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు చిరుధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో మొక్కజొన్న, పల్లికాయ ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు(బిల్టి) క్వింటాకు రూ.2,355 పలికింది. గత వారంతో పోలిస్తే మక్కల ధర తగ్గింది. అలాగే పచ్చి పల్లికాయ క్వింటాకి రూ.5,500 ధర రాగా.. సూక పల్లికాయకి రూ.7,500 ధర వచ్చింది.

Similar News

News December 26, 2025

WGL: మహిళా సంఘాల ఖాతాల్లో రూ.6.50 కోట్లు జమ

image

వరంగల్ జిల్లాలో రుణాలు సకాలంలో చెల్లించిన స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించింది. వడ్డీలేని రుణాల పథకం కింద 11 మండలాలకు రూ.6.50 కోట్లు విడుదల చేసి 7,540 సంఘాల ఖాతాల్లో జమ చేసింది. 2025-2028 రుణాలపై ఈ వడ్డీ రాయితీ వర్తించింది. అత్యధికంగా సంగెం మండలానికి రూ.79.52 లక్షలు, అత్యల్పంగా నెక్కొండకు రూ.76,958 లభించింది. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 24, 2025

వర్ధన్నపేట: ఏటీఎంలో కేటుగాడు

image

వర్ధన్నపేట ఎస్‌బీఐ బ్యాంకు ఏటీఎం వద్ద రైతు పిన్నింటి కిషన్‌రావు మోసానికి గురయ్యాడు. నగదు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో దుండగుడు అతని ఏటీఎం కార్డును మార్చి రూ.40 వేల నగదు కాజేశాడు. గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మోసగాడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

News December 24, 2025

వరంగల్ ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు

image

వరంగల్ డివిజన్ వ్యాప్తంగా 8 మంది ఎస్సైలకు సీఐగా పదోన్నతి కల్పించేందుకు డీపీసీ సిఫారసులను కమిషనర్ సి.హరికిరణ్ ఆమోదించారు. రోస్టర్ ప్రకారం రమాదేవి, రజిత, చంద్రశేఖర్, జ్యోతి, సరిత, అశోక్‌కుమార్ తదితరులకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అలాగే శ్రీనివాస్‌రెడ్డి, మురళి ఎక్సైజ్ సూపరింటెండెంట్లుగా, అంజన్రావు జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. జీవో విడుదల అనంతరం పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.