News March 3, 2025

చిరంజీవి గారూ.. కూతుళ్లూ వారసులే: కిరణ్ బేడీ

image

‘వారసత్వం కోసం ఓ మగబిడ్డను కనమని చరణ్‌ను అడుగుతుంటా’ అని ఇటీవల చిరంజీవి చేసిన <<15434876>>వ్యాఖ్యలు<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ తాజాగా స్పందించారు. ‘చిరంజీవి గారూ.. కూతుళ్లు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి, గుర్తించండి. మీరు ఎలా వారిని పెంచుతారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలను పెంచిన పేరెంట్స్ నుంచి నేర్చుకోండి. అమ్మాయిలేం తక్కువ కాదు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News March 4, 2025

సెమీస్‌లో ఎదురే లేని టీమ్ ఇండియా

image

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో టీమ్ ఇండియాకు అద్భుత రికార్డు ఉంది. గత 27 ఏళ్లుగా ఈ టోర్నీలో జరిగిన సెమీస్‌లో భారత్ ఓడిపోలేదు. సెమీస్‌కు వెళ్లిన ప్రతీసారి గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. 2000, 2002, 2013, 2017 సెమీ ఫైనళ్లలో విజయాలు నమోదు చేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇవాళ ఆసీస్‌తో జరగబోయే సెమీ ఫైనల్లోనూ అదే రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News March 4, 2025

మార్చి 04: చరిత్రలో ఈ రోజు

image

1886: స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి జననం
1961: భారత మొదటి విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ ప్రారంభం
1966: భారత జాతీయ భద్రతా దినోత్సవం
1973: డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి జననం
1980: టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం
1984: సినీ నటి కమలినీ ముఖర్జీ జననం
1987: నటి శ్రద్ధా దాస్ జననం

News March 4, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

error: Content is protected !!