News March 3, 2025
280 మంది ఇంటర్ పరీక్షలు రాయలేదు: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో సోమవారం ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 280 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 12,318 మంది విద్యార్థులకు గాను 12,038 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News March 4, 2025
రాష్ట్రస్థాయిలో ములుగుకు 89 మెడల్స్

ఏడో రాష్ట్రస్థాయి కరాటే టోర్నమెంట్ 2025 మేడారంలో నిర్వహించిన టోర్నమెంట్లో వెంకటాపురం మండలం విద్యార్థులు ప్రతిభ చాటారు. 89 మంది విద్యార్థులు పాల్గొంటే.. 56 గోల్డ్ మెడల్స్, 20 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. విద్యార్థులను సీఐ బండారి కుమార్, ఎస్సై తిరుపతిరావు అభినందించారు. కరాటే మాస్టర్ గొంది హనుమంతు, పశువుల సూర్యనారాయణ తదితరులున్నారు.
News March 4, 2025
రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలి: సీపీఎం

దేవనకొండ మండలంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై సీపీఎం నాయకుడు బీ.వీరశేఖర్ తహశీల్దార్ కార్యాలయంలో బైఠాయించారు. తెర్నేకల్ గ్రామానికి చెందిన మాబాషా అనే రైతుకు 7 ఎకరాల వ్యవసాయ పొలంలో 27 సెంట్లు హంద్రీనీవా కాలువ కింద పోయిందని, మిగిలిన 6 ఎకరాల 63 సెంట్లు పట్టాదారు పాసు బుక్కులో ఎక్కించాల్సి ఉండగా రీ సర్వే పేరుతో ఆలస్యం చేస్తున్నారనిధ్వజమెత్తారు.
News March 4, 2025
మార్చి 04: చరిత్రలో ఈ రోజు

1886: స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి జననం
1961: భారత మొదటి విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ ప్రారంభం
1966: భారత జాతీయ భద్రతా దినోత్సవం
1973: డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి జననం
1980: టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం
1984: సినీ నటి కమలినీ ముఖర్జీ జననం
1987: నటి శ్రద్ధా దాస్ జననం