News March 3, 2025
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలందరినీ భాగస్వాములను చేయాలన్నారు.
Similar News
News March 4, 2025
దొంగలు అరెస్ట్.. రూ.5.86 లక్షలు స్వాధీనం

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో కొన్ని రోజుల క్రితం తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులు నగదును దోచుకెళ్లారు. ఏసీపీ నరసయ్య కథనం ప్రకారం.. సోమవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జాడి శ్రీకాంత్(24),కోడెం గణేష్(24)లు చూసి పారిపోయారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్టు అంగీకరించారు. వారి నుంచి రూ.5,86,000 నగదు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
News March 4, 2025
ఆలూర్: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో గుత్ప వాసి మృతి

ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి మోహన్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో అప్పులు పెరగడంతో గత ఐదు నెలల క్రితం దుబాయ్ వెళ్లి డెలివరీ బాయ్‌గా పని చేస్తుండగా ఫిబ్రవరి 23న కారు ప్రమాదంలో మరణించాడు. సోమవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరారు.
News March 4, 2025
MHBD: జిరాక్స్ సెంటర్లు మూసేయండి: కలెక్టర్

మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలు దగ్గర్లో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయించాలని అధికారులను ఆదేశించారు.