News March 22, 2024

VZM: భార్యపై కత్తితో దాడిచేసిన భర్త

image

భర్త భార్యను హతమార్చిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
జియ్యమ్మవలస మండలం సింగనాపురం గ్రామానికి చెందిన గంటా ముసలి నాయుడు భార్య అప్పలనరసమ్మపై కత్తితో దాడిచేయగా, ఆమె కడుపులో కత్తి దిగింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. ముసలి నాయుడు పరారిలో ఉండడంతో కేసు నమోదుచేసి, గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News

News January 14, 2026

పట్టువర్ధనంలో పండగ వేళ విషాదం

image

వంగర మండలం పట్టువర్ధనంలో బుధవారం పండగ పూట విషాదం నెలకొంది. గ్రామస్థుడు రాజు కుమార్ (30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన స్నేహితులతో కలసి పడవపై మడ్డువలస రిజర్వాయర్‌లో ప్రయాణించాడు. ప్రమాదవశాత్తు మధ్యలో పడవ బోల్తా పడగా..ఈత రాక రాజు కుమార్ నీట మునిగి మృతి చెందాడు. భార్య వాణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం డెడ్ బాడీని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టానికి తరలించారు.

News January 14, 2026

అనాథ చిన్నారులతో భోగి సంబరాలు జరుపుకున్న కలెక్టర్ దంపతులు

image

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి దంపతులు భోగి పర్వదినాన్ని అనాథ చిన్నారులతో జరుపుకున్నారు. కె.ఎల్.పురంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ శిశువుల ఆశ్రమాన్ని తన సతీమణితో బుధవారం సందర్శించి శిశుగృహంలో చిన్నారులతో కలిసి భోగి పండుగను జరుపుకున్నారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు.

News January 14, 2026

తెలుగు సాంప్రదాయాలను కాపాడాలి: ఎమ్మెల్యే బేబినాయన

image

తెలుగు సంప్రదాయాలను కాపాడాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బాడంగి మండలం గజరాయునివలసలో బుధవారం ఎద్దులతో బండ లాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రైతులకు బండ లాగుడు పందెం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 15 గ్రామాల నుంచి రైతులు పాల్గొన్నారు.