News March 3, 2025
అమలాపురం: ఉన్నత విద్యకు 10వ తరగతి తొలి మెట్టు

ఉన్నత విద్యకు 10వ తరగతి తొలిమెట్టు అని జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి అన్నారు. అమలాపురం డీఆర్ఓ ఛాంబర్‌లో సోమవారం 10వ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షించారు. పదో తరగతి పరీక్షలకు జిల్లాలోని 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 19,217 మంది విద్యార్థులు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. డీఈవో బాషా పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
GNT: ఆస్తి పన్ను వసూళ్లలో కట్టుదిట్టం

జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో రసీదు పుస్తకాల దుర్వినియోగంతో పన్ను సొమ్ము పక్కదారి పడుతోంది. పన్ను చెల్లించినా మళ్లీ రసీదులు ఇస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేసింది. వాట్సాప్ ద్వారా నోటీసులు పంపి, క్యూఆర్ కోడ్ యూపీఐతో చెల్లించిన వెంటనే రసీదు మొబైల్‌కి వస్తోంది. ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్లకుండా ఖాతాకు జమ అవుతోంది. మొత్తం బకాయిలు రూ.47.82 కోట్లు.
News November 24, 2025
MBNR: 110 పోగొట్టుకున్న ఫోన్లు స్వాధీనం

సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జానకి అన్నారు. ఇటీవల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొత్తం 110 మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ (Central Equipment Identity Register) సహకారంతో ట్రేస్ చేసి, సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కవాతు మైదానంలో బాధితులకు అందజేశారు. ప్రతి పౌరుడు డిజిటల్ సురక్షపై అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
News November 24, 2025
ధర్మేంద్ర గురించి తెలుసా?

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. పంజాబ్ లుధియానాలోని నస్రలీ గ్రామంలో 1935 డిసెంబర్ 8న ఆయన జన్మించారు. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ కింగ్‌గానూ పేరు గాంచిన ఆయన సినీ రంగానికి చేసిన కృషికి 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005లో BJP తరఫున రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.


