News March 3, 2025
కరీంనగర్: ప్రారంభమైన టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, టీచర్స్ ఎమ్మెల్సీ ప్రాథమిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్ల విభజన చేశారు. ప్రస్తుతం టీచర్ల ఓట్ల కట్టలను టేబుల్స్ పైకి తీసుకొచ్చారు. మరి కొద్దిక్షణాల్లోనే టీచర్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ఓట్ల కౌంటింగ్ కోసం అధికారులు14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
Similar News
News November 8, 2025
నాగిరెడ్డిపేట: భార్య గొంతు కోసిన భర్త

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా భర్త తన భార్య గొంతును కోసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. నాగిరెడ్డిపేట మండలం చీనురు గ్రామానికి చెందిన నారాయణ ఆయన భార్య రామవ్వ మధ్య గొడవ జరిగిందన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నారాయణ తన భార్య గొంతు కోసినట్లు చెప్పారు. గాయపడిన రామవ్వను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
News November 8, 2025
ఆ ఐదు సెలవులు రద్దు: ప్రకాశం డీఈవో

సెలవులపై ప్రకాశం డీఈవో ఎ.కిరణ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈనెలతో పాటు వచ్చే మార్చి వరకు ఉన్న అన్ని రెండో శనివారం సెలవులు రద్దు చేశామని ప్రకటించారు. తుఫాన్ నేపథ్యంలో వరుస సెలవులు ఇవ్వడంతో ఈ 5సెలవు రోజుల్లో స్కూళ్లు పనిచేయాలని ఆదేశించారు. ఈనెల రెండో శనివారం, డిసెంబర్ 13, 2026 జనవరి 25, ఫిబ్రవరి 14, మార్చి 14వ తేదీల్లో స్కూళ్లు నిర్వహించాలన్నారు.
News November 8, 2025
బెల్లంపల్లి: చెక్ బౌన్స్.. జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా: సీఐ

చెక్ బౌన్స్ కేసులో ఒకరికి జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన నవీన్‌కు తీర్యాణి మండలం గంభీర్రావుపేటకు చెందిన శ్రావణ్ ఇచ్చిన రూ.10లక్షల చెక్ బౌన్స్ అయింది. నవీన్ కేసు వేశారు. నేరం రుజువు కావడంతో శ్రావణ్‌కు జడ్జి సంవత్సరం జైలు శిక్ష రూ.12 లక్షల జరిమానా విధించారు.


