News March 3, 2025

ఖమ్మం: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494

Similar News

News September 17, 2025

ఇకపై లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు

image

శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లకు FIFO (First In First Out) స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని TTD ప్రవేశపెట్టింది. టోకెన్లు 3 నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల అవుతాయి. DEC టోకెన్ల కోసం SEP 18-20 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజూ (శుక్రవారం) 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గడువు 180 రోజులుగా నిర్ణయించింది.

News September 17, 2025

జగిత్యాల: లక్ష్య సాధనలో బ్యాంకర్లు సహకరించాలి: కలెక్టర్

image

లక్ష్య సాధనలో బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కన్సల్టేటివ్ కమిటీ (DCC) సమావేశం మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ జిల్లా స్థాయిలో వార్షిక ఋణ ప్రణాళిక (ACP) అమలుపై నివేదికను సమర్పించారు. అన్ని బ్యాంకులు పంట రుణాల రెన్యువల్ ను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2025

విశాఖలో బిజినెస్ సమ్మిట్‌కు సీఎం, కేంద్రమంత్రి

image

విశాఖలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పర్యటించనున్నారు. AU కన్వెన్షన్ సెంటర్‌లో మధ్యాహ్నం జరిగే ‘స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్’సభకు వీరిద్దరూ హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అనంతరం 3గంటలకు రాడిసన్ బ్లూలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే బిజినెస్ సమ్మిట్‌‌లో పాల్గొంటారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు రానున్నారు.