News March 22, 2024
ఒంటిమిట్టలో 25న పౌర్ణమి కళ్యాణం

ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మార్చి 25వ తేదీన స్వామివారికి పౌర్ణమి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో వారు మాట్లాడుతూ.. ప్రతి నెల రెండు, నాలుగో శనివారాలలో తిరుమల లడ్డూలు స్వామివారి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Similar News
News September 5, 2025
కొండాపురంలో పూణే -కన్యాకుమారి రైలు హాల్టింగ్

ప్రయాణికుల సౌకర్యార్థం కడప MP వైయస్ అవినాశ్‌రెడ్డి వినతి మేరకు జిల్లాలోని రైల్వే స్టేషన్లో కొత్తగా 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పూణే -కన్యాకుమారి -పూణే (16381/82) మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కొండాపురంలో ఒక నిమిషం పాటు ఆగనుంది. (17622) తిరుపతి- ఔరంగాబాద్ రైలుకు ఎర్రగుంట్లలో హాల్టింగ్ కల్పించారు. ఆయా ప్రాంతాల ప్రయాణికులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
News September 5, 2025
పథకాల అమలును పరిశీలించాలి: కలెక్టర్

ప్రభుత్వ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం CS వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. సీఎస్ సూచనల మేరకు జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని పనులపై సమీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News September 5, 2025
ఇడుపులపాయ: మినిమం టైమ్ స్కేల్ జీఓపై హర్షం

గత 15 ఏళ్లుగా నిబద్ధతతో ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో నాన్‌టీచింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ జీఓ మంజూరయ్యింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తమ ఉద్యోగ భద్రతను కాపాడినందుకు సీఎం చంద్రబాబు, డీసిఎం పవన్ కళ్యాణ్, జీఓ అమలులో సహకరించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.