News March 3, 2025

ఏటికొప్పాక: హస్త కళాకారుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

image

ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో కలెక్టర్ విజయకృష్ణన్ సోమవారం పర్యటించారు. ఏటి కొప్పాక లక్క బొమ్మలు తయారు చేసే హస్త కళాకారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లక్క బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు కర్రకు కొరత ఏర్పడడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రాష్ట్రపతి అవార్డు గ్రహీత చిన్నయచారి, రిపబ్లిక్‌డే శకటం డిజైనర్ గోర్స సంతోష్ కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

Similar News

News November 9, 2025

బాధపడొద్దు.. తెల్ల జుట్టు మంచిదే : సైంటిస్ట్‌లు

image

జుట్టు తెల్లబడటం మంచిదే అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. శరీరంలో క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను నాశనం చేసే ప్రాసెస్‌లో జుట్టు రంగు కోల్పోతుందని చెబుతున్నారు. మెలనోసైట్ సెల్స్ కారణంగా జుట్టు నల్లగా ఉంటుందని, ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడే ఈ కణాలు జుట్టుకు రంగును అందిస్తాయని అంటున్నారు. శరీరంలో క్యాన్సర్‌గా మారే కణాలను అంతం చేసే ప్రక్రియలో మెలనోసైట్స్ తమను తాము చంపుకుంటాయని స్పష్టం చేస్తున్నారు.

News November 9, 2025

HYD: సైబర్ నేరాల బాధితులు ఫిర్యాదు చేయండి: సీపీ

image

నగరంలో రోజూ రూ.కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడుల పేరుతో చాలా యాప్‌లలో ప్రజలు మోసపోతున్నారని, డబ్బు ఊరికే రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. APK ఫైల్స్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని వివరించారు. సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న వెంటనే బాధితులు 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

News November 9, 2025

ఎండల మల్లన్నను దర్శించుకున్న ఎస్పీ

image

టెక్కలి మండలం రావివలస శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామివారిని ఆదివారం సాయంత్రం ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ గురునాథ రావు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. సోమవారం కార్తీకమాసం ఉత్సవం సందర్భంగా భద్రత చర్యలు పటిష్ఠంగా చేపట్టాలని అధికారులకు ఎస్పీ సూచించారు.