News March 3, 2025
మెదక్: ‘ప్రజావాణికి 24 దరఖాస్తులు’

ప్రజావాణి కార్యక్రమానికి 24 దరఖాస్తులు వచ్చాయని అదనపు జిల్లా కలెక్టర్ నగేశ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పలు సమస్యలపై దరఖాస్తులు రాగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. భూ సమస్యలు ఉన్నవారు తమ తమ మండల కేంద్రంలోని తహశీల్దారులకు సోమవారం అర్జీలు పెట్టుకోవాలని కలెక్టర్ కోరారు.
Similar News
News March 4, 2025
టెన్త్ విద్యార్థులకు OMRపై అవగాహన కల్పించాలి: డీఈవో

ఈ నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే ప్రి ఫైనల్ పరీక్షలో పదో తరగతి విద్యార్థులకు ఓఎంఆర్ పత్రాల్లో సమాచారంపై అవగాహన కల్పించాలని మెదక్ డీఈవో రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఓఎంఆర్ పత్రాలను సంబంధిత మండల వనరుల కార్యాలయం నుంచి తీసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
News March 4, 2025
రంజాన్‌కు పక్కడ్బందీగా ఏర్పాట్లు: అదనపు కలెక్టర్

మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రంజాన్ మాసం పండుగ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్యారోగ్య, ఆర్&బీ, విద్యుత్, పౌరసరఫరాలు, తదితర శాఖల అధికారులతో పాటు పలువురు మత పెద్దలతో చర్చించారు.
News March 4, 2025
మెదక్: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు

హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పంటలకు సమృద్ధిగా సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు పరిశీలన, సింగల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.