News March 3, 2025
MLC కౌంటింగ్.. ఎలిమినేట్ అవుతున్న అభ్యర్థులు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు ఎలిమినేట్ అవుతున్నారు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదుగురు అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఇంకా ఐదుగురు అభ్యర్థులు మిగిలి ఉన్నారు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులలో పి.శివ ప్రసాద్, ఎస్‌ఎస్.పద్మావతి, డాక్టర్ కే.రాధాకృష్ణ, ఆర్.సత్యనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు ఉన్నారు. కాగా ‘గాదె’ ముందంజలో కొనసాగుతున్నారు.
Similar News
News November 7, 2025
ఇవాళ ‘SSMB29’లో పృథ్వీరాజ్ లుక్ రిలీజ్: రాజమౌళి

సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో తీస్తోన్న SSMB29 చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ షూట్ జరుగుతున్నట్లు డైరెక్టర్ రాజమౌళి వెల్లడించారు. ఇదే సమయంలో ఈనెల 15న జరగనున్న ‘GlobeTrotter’ ఈవెంట్ కోసమూ భారీగా సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ‘ఈ ఈవెంట్ వరకు వేచి ఉండలేం. అందుకే ఈ వారాన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నింపుతాం. అందులో భాగంగానే ఇవాళ పృథ్వీరాజ్ లుక్ రిలీజ్ చేస్తాం’ అని ట్వీట్ చేశారు.
News November 7, 2025
మన్యంలో క్రమేపీ తగ్గుతున్న ఉష్టోగ్రతలు

అల్లూరి జిల్లాలో రాత్రి పూట క్రమేపీ చలి పెరుగుతోంది. ఉష్టోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. ఉదయం మంచుకురుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలోని జీ.మాడుగులలో గురువారం 14.2 ° సెల్సియస్ నమోదు కాగా అరకువ్యాలీలో 14.9°, డుంబ్రిగుడ 15.5, ముంచంగిపుట్టు 15.7, హుకుంపేట16, పెదబయలు 16.3, పాడేరు16.7, చింతపల్లి 17, వై. రామవరం 19°, మారేడుమిల్లి 19.3 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News November 7, 2025
SECLలో 543 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్ (SECL)లో 543 అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్ పాసై ఉండాలి. డిపార్ట్‌మెంట్ అభ్యర్థులకు 3ఏళ్ల అనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://secl-cil.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి


