News March 3, 2025
పదో తరగతి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి: DEO సలీం బాషా

ప్రభుత్వం పదో తరగతి హాల్ టికెట్లను విడుదల చేసిందని డీఈఓ షేక్ సలీమ్ బాషా సోమవారం తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. వాట్సాప్ నంబర్‌కు హాయ్ అని పెట్టాలని, ప్రభుత్వ సర్వీసులు డిస్ ప్లే అవుతాయన్నారు. విద్యా శాఖను ఎంపిక చేసుకొని ఆధార్ లేదా రూల్ నంబర్, పుట్టిన తేదీ ఎంట్రీ చేసి సబ్మిట్ కొడితే హాల్ టికెట్ పీడీఎఫ్ వస్తుందన్నారు.
Similar News
News November 8, 2025
NZB: రియాజ్ ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీలో ఫిర్యాదు

NZB CCS కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన షేక్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. అది కస్టోడియల్ డెత్ అని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం(NHRC), జాతీయ మహిళా కమిషన్(NCW), బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR)కు ఫిర్యాదు చేశారు. దీనిపై CBIతో విచారణ జరిపించాలని ప్రజా సంఘాల నేతలతో కలసి రియాజ్ తల్లి జరీనా బేగం, భార్య సనోబర్ నజ్జీన్ వినతిపత్రాలు అందజేశారు.
News November 8, 2025
వేములవాడలో కొండెక్కిన కొబ్బరికాయ ధరలు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలో కొబ్బరికాయల ధరలు విపరీతంగా పెరిగాయి. దేవాలయం వెళ్లాలన్నా, ఇంట్లో పూజ చేయాలన్నా కొబ్బరికాయ తప్పనిసరి కావడంతో, భక్తుల సెంటిమెంట్‌ను దుకాణదారులు ఆసరాగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో కొబ్బరికాయను సాధారణ కిరాణా దుకాణాల్లో సైతం రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తూ భక్తుల జేబులకు చిల్లు పెడుతున్నారు.
News November 8, 2025
ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో 64 ఉద్యోగాలు

ఎయిమ్స్ బిలాస్‌పుర్ 64 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎమ్మెస్సీ, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎంసీహెచ్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.1,180, SC,STలకు రూ.500. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsbilaspur.edu.in


