News March 22, 2024
అమలాపురం ఎంపీ అభ్యర్థిగా హరీశ్.. నేపథ్యం ఇదే

టీడీపీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీశ్ మాధుర్ పోటీ చేయనున్నట్లు అధినేత చంద్రబాబు ప్రకటించారు. హరీశ్ 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి మళ్లీ ఇదే పార్లమెంట్ స్థానం నుంచి ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈయన జీఎంసీ బాలయోగి కుమారుడు.
Similar News
News September 17, 2025
రాజమండ్రి: పీఎం ఆవాస్ యోజన బ్రోచర్ ఆవిష్కరణ

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 అంగీకార బ్రోచర్‌ను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం రాజమండ్రిలోని కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంత ఇంటి కల సాకారమవుతుందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు అక్టోబరు 31 లోగా తమ అంగీకారాన్ని తెలియజేయాలని ఆమె కోరారు.
News September 17, 2025
కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతి వేడుకలు

విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగాయని కలెక్టర్ తెలిపారు.
News September 16, 2025
మంత్రి కందులను కలిసిన కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి మంత్రి కందుల దుర్గేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన రాజమండ్రికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతమని, దానిని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కలెక్టర్‌కు సూచించారు.