News March 3, 2025

కొత్తగూడెం: ఈవీఎం గోడౌన్‌లో కలెక్టర్ తనిఖీ

image

కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతినెల తనిఖీ చేస్తామని, ఇందులో భాగంగా ఈవీఎం గోడౌన్‌ను సందర్శించామని తెలిపారు. ఈ పరిశీలనలో భాగంగా ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరా గదిలో కెమెరాల పనితీరును పరిశీలించారు.

Similar News

News February 2, 2026

ఖమ్మం పాలిటిక్స్.. పోలీసుల విలవిల

image

ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీల ఆధిపత్య పోరు పోలీసులకు శాపంగా మారింది. BRS నిరసనలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న వన్ టౌన్ సీఐ కరుణాకర్ చేయి విరగింది. సీఐపై దాడిని సీరియస్‌గా తీసుకున్న సీపీ సునీల్ దత్ అరుగురిపై కేసు నమోదు చేశారు. గతంలోనూ కొందరు అధికారులు సస్పెన్షన్లు, వీఆర్ఎస్‌లతో ఇబ్బందులు పడ్డారు. పార్టీల మధ్య నలిగిపోతూ విధులు నిర్వర్తించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.

News February 2, 2026

ఏలూరు జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

image

ఏలూరు జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు పట్టణంలో గంగానమ్మ జాతర మహోత్సవం సందర్భంగా ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు తదితర కారణాల దృష్ట్యా పీజీఆర్ఎస్‌ను రద్దు చేశామన్నారు. ప్రజలందరూ గమనించాలన్నారు.

News February 2, 2026

ప్రకాశం: ‘నేడు మీ కోసం రద్దు ‘

image

ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో ఫిబ్రవరి 2వ తేదీన జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, మీకోసం కార్యక్రమం రద్దు చేసున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం పురస్కరించుకొని కార్యక్రమం రద్దు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని దూర ప్రాంతాలనుంచి ఎస్సీ కార్యాలయానికి వచ్చే ప్రజలు గమనించాలని కోరారు.