News March 3, 2025
కాకినాడ: పార్సిల్ కార్యాలయాలపై పోలీసు దాడులు

కాకినాడలోని బాలాజీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో సోమవారం ఉదయం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని పార్సిల్ కార్యాలయాలలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయం వెల్లడించింది. అనుమానిత పార్సిల్ ఉంటే తమకు తెలియజేయాలని పోలీసులు సూచించారు.
Similar News
News November 3, 2025
ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి..

పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్తులు..
★ అందరిలోనూ దైవాన్ని చూడు. నువ్వు ఎవరికి నమస్కరించినా, అది చివరకు ఆ భగవంతుడికే చేరుతుంది
★ ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు
★ నామస్మరణ చేయండి, మీ నాలుక మధురం అవుతుంది, మీకు మంచి కలుగుతుంది
★ కేవలం అన్నం కోసం కాక, ధర్మం కోసం బతకండి.
News November 3, 2025
NLG: కలిసిరాని ‘ఖరీఫ్’

జిల్లా రైతులకు ఖరీఫ్ సాగు కలిసి రాలేదు. ముందస్తుగా మురిపించిన వరుణుడు.. ఆ తరువాత ముఖం చాటేశాడు. దీంతో మొలకదశలో పంటలు ఎండుముఖం పట్టాయి. ఆ తరువాత కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించాయి. దీంతో ఎంతో ఆశతో రైతులు వానాకాలంలో 11,50,556 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షలు కోలుకోలేని దెబ్బ తీశాయి. జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
News November 3, 2025
కంకరలో కూరుకుపోయి ఊపిరి ఆగి..

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన <<18183371>>బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే కారణమని తెలుస్తోంది. మితిమీరిన వేగంతో టిప్పర్ బస్సుపైకి దూసుకొచ్చింది. దీంతో అందులోని కంకర మొత్తం బస్సులో కుడివైపు కూర్చున్న ప్రయాణికులపై పడింది. అందులో కూరుకుపోవడంతో ఊపిరి తీసుకోలేక చాలా మంది ప్రాణాలు వదిలినట్లు సమాచారం. బస్సులో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.


