News March 3, 2025
గుడిహత్నూర్‌లో బాలిక సూసైడ్

గుడిహత్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సూర్యగూడ గ్రామానికి చెందిన గెడం వేదిక(16) సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వెల్లడించారు.
Similar News
News January 13, 2026
బాధితులకు రూ.25వేల సాయం ప్రకటన

AP: కాకినాడ(D) సార్లంకపల్లె <<18842252>>అగ్నిప్రమాదం<<>>పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బాధిత కుటుంబాలకు తక్షణసాయంగా రూ.25వేలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ప్రస్తుతం వసతి, ఇతర సహాయాలు అందించాలని సూచించారు. కాగా నిన్న సార్లంకపల్లెలో 40 తాటాకు ఇళ్లు అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన విషయం తెలిసిందే.
News January 13, 2026
విశాఖ: స్వపక్షంలోనే విపక్షమా..!

కూటమిలో కీలకంగా ఉన్నా.. తనదైన వ్యాఖ్యలతో తరచూ చర్చకు కేంద్రంగా నిలుస్తున్నారు MLA విష్ణుకుమార్ రాజు. డేటా సెంటర్ల ఉద్యోగాల అంశం, రుషికొండ భవనాల, భోగాపురం ఎయిర్‌పోర్ట్ విషయంలో ప్రభుత్వానికి అసౌకర్యం కలిగేలా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. కూటమిలో తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావన.. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఆయనకు సంబంధించిన బకాయిలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో అసహనానికి గురవుతున్నారనే వాదన ఉంది.
News January 13, 2026
గజ్వేల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌లో సోమవారం రాత్రి జరిగింది. మల్లన్నసాగర్ R&B కాలనీ ఎర్రవల్లికి చెందిన మధుయాదవ్, ఆర్మూర్‌కు చెందిన గంగిరెడ్డి(25) మిత్రులు. ఇద్దరు కలిసి మల్లన్నసాగర్ వద్ద ఉన్న పొలానికి బైక్‌పై వెళ్లి వస్తుండగా రాజీవ్ రహదారిపై హరిత రెస్టారెంట్ వద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గంగిరెడ్డి మృతి చెందగా, మధు తీవ్రంగా గాయపడ్డారు.


