News March 22, 2024
మరో రెండు స్థానాలకు BRS ఎంపీ అభ్యర్థుల ప్రకటన
TG: నాగర్ కర్నూల్, మెదక్ ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ నుంచి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా ఆరు సీట్లకు క్యాండిడేట్లను నిర్ణయించాల్సి ఉంది.
Similar News
News January 9, 2025
బాబాయ్-అబ్బాయ్: ఫిర్ ఏక్ బార్ ఏక్ సాథ్?
శరద్ పవార్-అజిత్ పవార్ వర్గాలు తిరిగి ఏకమవుతాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవైపు కేంద్ర మంత్రి పదవులు ఆశచూపి శరద్ వర్గం MPలను అజిత్ వర్గం ఆకర్షిస్తోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇద్దరూ కలవాలని దేవుణ్ని ప్రార్థించినట్టు అజిత్ తల్లి ఆశాతాయి పేర్కొన్నారు. MPల ఫిరాయింపు, NDAలో చేరికను ఇరు వర్గాలు ఖండిస్తున్నాయి. అయితే కింది స్థాయి నేతలు బలంగా కోరుకుంటున్నారు.
News January 9, 2025
అంతరిక్షం నుంచి లాస్ ఏంజెలిస్ వైల్డ్ ఫైర్ PHOTO
అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు వేలాది ఎకరాలను దహించివేస్తోంది. దావానలంలా వ్యాపిస్తున్న మంటల్లో గ్రామాలన్నీ బూడిదవుతున్నాయి. ఈ వైల్డ్ ఫైర్, పొగ ఏకంగా అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తున్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ESA ప్రయోగించిన కోపర్నికస్ సెంటినెల్-2 శాటిలైట్ ఈ అగ్నికీలల ఫొటో తీసింది.
News January 9, 2025
ఇజ్రాయెల్‌కూ పాకిన సొరోస్ విద్వేషం: మస్క్
రెజిమ్ ఛేంజర్ జార్జ్ సొరోస్ మానవజాతి విద్వేషి అని బిలియనీర్ ఎలాన్ మస్క్ మండిపడ్డారు. ఆయన విద్వేషం ఇజ్రాయెల్‌కూ పాకిందన్నారు. హమాస్ మిలిటెంట్లకు మద్దతిచ్చే NGOకు ఆయన $15 మిలియన్లు డొనేట్ చేశారన్న ఇజ్రాయెలీ UN అంబాసిడర్ గిలాడ్ ఎర్డాన్ వ్యాఖ్యలపై స్పందించారు. సొరోస్‌కు బైడెన్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డును ప్రకటించడంతో ఇంతకన్నా అపహాస్యం ఉండదంటూ సెటైర్ వేయడం తెలిసిందే.