News March 3, 2025
మనసు ‘దోశే’సిన వంటకం!

తెలుగువారికి బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ లేకుంటే రోజు గడవదంటే అతిశయోక్తి లేదు. దీనిలో ఎన్ని వెరైటీలున్నాయో చెప్పడానికి ఒకరోజు సరిపోదు. ప్రధానంగా ఉల్లి దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, ఎగ్ దోశ మన వద్ద ఫేమస్. దోశ వేయడమనేది తమిళనాడులో మొదలైందని అంటారు. అట్టు నుంచే దోశ పుట్టిందనేది మరో కథనం. ఏదేమైనా నేడు ప్రపంచమంతా విస్తరించిందీ వంటకం. ఈరోజు దోశ దినోత్సవం. మరి మీకు నోరూరించే దోశ ఏది? కామెంట్ చేయండి.
Similar News
News March 4, 2025
ఆధిక్యంలో పేరాబత్తుల రాజశేఖరం

AP: తూ.గో-ప.గో జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 28 టేబుళ్లలో జరుగుతున్న కౌంటింగ్‌లో నాల్గవ రౌండ్ పూర్తయ్యే నాటికి 1,02,236 ఓట్లు చెల్లుబాటు అయినట్లు గుర్తించారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 64,405 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు 23,252 ఓట్లు పొందారు. 41,153 ఓట్ల మెజార్టీతో రాజశేఖరం ఉండగా, ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
News March 4, 2025
టీమ్ ఇండియా ఫైనల్ చేరేనా?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ జరిగే సెమీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాలని టీమ్ ఇండియా భావిస్తోంది. వన్డే వరల్డ్ కప్‌లో ఎదురైన పరాభవానికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఆసీస్ కూడా ఈ మ్యాచులో నెగ్గి ఫైనల్లో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
News March 4, 2025
తిరుమల అన్నప్రసాదంలో వడలు?

AP: శ్రీవారి భక్తులకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ నెల 6 నుంచి వడలు కూడా అందించనున్నట్లు సమాచారం. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా జనవరిలో వారంపాటు రోజుకు 5 వేల చొప్పున వడలను వడ్డించారు. అయితే లక్ష మంది భక్తులకు వడ్డించేందుకు సిబ్బంది కొరత ఉన్నట్లు గుర్తించారు.