News March 3, 2025
కోహ్లీ ఎప్పటికీ తృప్తి పడరు: గవాస్కర్

విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్‌కూ మెరుగవ్వాలని చూస్తుంటారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. ‘సాధించిన దాని గురించి కోహ్లీ ఎప్పటికీ తృప్తి పడరు. భారత్‌కు ఆడటాన్ని అదృష్టంగా భావిస్తారు. రికార్డుల్ని మాత్రమే కాదు. మైదానంలో ఆయన నిబద్ధత చూడండి. జట్టు కోసం ఏం చేయాలన్నా చేస్తారు. అందుకే భారత క్రికెట్ అనే విద్యాలయంలో విద్యార్థి స్థాయి నుంచి ఛాన్సలర్ స్థాయికి చేరుకున్నారు’ అని ప్రశంసించారు.
Similar News
News March 4, 2025
ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా?

ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది రాత్రుళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే మానసిక సమస్యలు 30 శాతం ఎక్కువవుతాయి. మానసిక ఆందోళన, డిప్రెషన్, చిరాకు వంటివి వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీవ గడియారం దెబ్బ తినడం వల్ల మతిమరుపు సమస్య రావచ్చు. ఊబకాయం, షుగర్ జబ్బులు వస్తాయి.
News March 4, 2025
హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలని డిమాండ్

TG: హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ యశ్వంత్ డిమాండ్ చేశారు. ఎయిర్‌పొల్యూషన్, PAK, చైనాకు ఢిల్లీ దగ్గరలో ఉండటంతో దేశ రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని నిన్న HYDలో జరిగిన సమావేశంలో కోరారు. ‘సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇక్కడే జరపాలి. HYDను దేశానికి రెండో రాజధాని చేయాలి’ అని సదస్సులో పేర్కొన్నారు.
News March 4, 2025
ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సహాయం నిలిపివేత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేశారు. రష్యాతో శాంతి విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహకరించడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆ దేశానికిచ్చే సాయాన్ని ఆయన సమీక్షిస్తున్నారని శ్వేతసౌధం పేర్కొంది. ‘అధ్యక్షుడి దృష్టంతా శాంతిస్థాపన మీదే ఉంది. రష్యా-ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తున్నారు’ అని తెలిపింది.