News March 3, 2025

NZB: మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..!

image

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.1983లో ఆయన శాలివాహనగ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUSఅభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.

Similar News

News July 4, 2025

NZB: రెండు రోజుల పసికందు విక్రయం

image

NZBలో 2 రోజుల పసికందును విక్రయానికి పెట్టింది ఓ తల్లి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ గర్భిణి జూన్ 30న ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశివుకు జన్మనించింది. నాగారానికి చెందిన ఓ మధ్యవర్తి సాయంతో పులాంగ్ ప్రాంతానికి చెందిన మరో మహిళకు రూ.2 లక్షలకు విక్రయించేందుకు బేరం కుదిరింది. ఈ విషయం 1 టౌన్ పోలీసులకు తెలియడంతో తల్లితో పాటు మధ్యవర్తులను విచారిస్తున్నారు.

News May 7, 2025

NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి మృతి

image

NZB ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆసుపత్రి రేకుల షెడ్డు కింద అపస్మారక స్థితిలో పడి ఉండడంతో సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 40-45 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మృతుడి జేబులో తినాలి రవి, ఆర్మూరు మండలం మామిడిపల్లి అనే ఆధార్ కార్డు ఉందన్నారు.

News May 7, 2025

నిజామాబాద్: బావిలో పడి వ్యక్తి మృతి

image

జక్రాన్‌పల్లిలో బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. గ్రామానికి చెందిన మాడవీరి ముత్యం(50) తాగిన మైకంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బావిలో మృతదేహం తేలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ తిరుపతి మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.