News March 3, 2025

ADB: మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..!

image

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1983లో శాలివాహన గ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJP తరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతిచ్చింది.

Similar News

News July 6, 2025

గుడిమల్కాపూర్ మార్కెట్ తరలింపునకు ఏర్పాట్లు?

image

నగరంలో అతిపెద్ద పూల మార్కెట్ గుడిమల్కాపూర్ మార్కెట్. రోజు రోజుకు రద్దీ పెరుగుతుండడంతో ఇరుకుగా మారుతోంది. ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో మార్కెట్‌ను నగర శివారుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పూలు, పండ్లు, కూరగాయల అన్నిటికి వేదికగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం 150 ఎకరాల స్థలం అవసరం ఉందని అంచనా వేసిన అధికారులు భూముల లభ్యతను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

News July 6, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం కలెక్టరేట్‌లో జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆదివారం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో, MRO కార్యాలయాల్లో అర్జీలను ఇవ్వవచ్చని ఆయన తెలిపారు.

News July 6, 2025

PLEASE CHECK.. ఇందులో మీ పేరు ఉందా?

image

AP: అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. https://annadathasukhibhava.ap.gov.in/లో చెక్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు <<16960279>>అనర్హత <<>>ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.