News March 3, 2025
KNR: మల్కా కొమురయ్య నేపథ్యం ఇదే..!

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.1983లో ఆయన శాలివాహన గ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.
Similar News
News July 7, 2025
వరంగల్: నేడు బల్దియా సమావేశం

గ్రేటర్ వరంగల్ నగర పాలకవర్గం సమావేశం సోమవారం ఉదయం 11.30 గంటలకు జరగనుంది. ఈ మేరకు నగరంలో 66 డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న పనులకు సంబంధించి నిధులు విడుదల చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. పాలకవర్గం కాల పరిమితి మరో 10 నెలలు ఉండటంతో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 23 అంశాలను కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టనున్నారు.
News July 7, 2025
జుక్కల్: మంత్రి వర్యా.. అలంకించండి

జుక్కల్ నియోజకవర్గంలో ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. పిట్లం మండలం హస్నాపూర్ వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం, కామారెడ్డి-సంగారెడ్డి అంతర్ జిల్లాల రోడ్డు నిర్మాణానికి పడిన అడుగులు ఆగిపోయాయి. నియోజకవర్గంలో సెంట్రల్ లైటింగ్ పనులు.. ఇలా మరెన్నో సమస్యలు ఉన్నాయి. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏం చేస్తారో చూడాలి.
News July 7, 2025
అనంతగిరి: సీహెచ్ డబ్ల్యూలను ఆశా కార్యకర్తలుగా మార్చాలి

అల్లూరి జిల్లాలో 700 మంది సీహెచ్ డబ్ల్యూలు పనిచేస్తున్నారని, వారందరినీ ఆశా కార్యకర్తలుగా మార్చాలని అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు కోరారు. ఆదివారం అనంతగిరి మండలంలో పర్యటించిన డీఎంహెచ్‌వో డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడును ఆయన కలిశారు. సీహెచ్ డబ్ల్యూలను ఆశా కార్యకర్తలుగా మార్చాలని విన్నవించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులను వెంటనే భర్తీచేయాలని కోరారు.