News March 3, 2025
నిర్మల్: 8, 9వ తరగతి విద్యార్థులకు పోటీలు

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో 8, 9 తరగతుల బాలికలకు బేటి బచావో.. బేటి పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని డీఈవో రామారావు తెలిపారు. ఈ నెల 4న పాఠశాల స్థాయిలో, 5న మండల స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Similar News
News March 4, 2025
NZB: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో గుత్ప వాసి మృతి

NZB ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి మోహన్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో అప్పులు పెరగడంతో గత ఐదు నెలల క్రితం దుబాయ్ వెళ్లి డెలివరీ బాయ్‌గా పని చేస్తుండగా ఫిబ్రవరి 23న కారు ప్రమాదంలో మరణించాడు. సోమవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరారు.
News March 4, 2025
ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా గెలుపొందిన శ్రీపాల్ రెడ్డికి సర్టిఫికెట్ అందజేత

ఖమ్మం – వరంగల్- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపొందిన పింగిలి శ్రీపాల్ రెడ్డికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సర్టిఫికెట్‌ను అందజేశారు. హోరా హోరీ సాగిన స్థానంలో యుటిఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి పై పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
News March 4, 2025
నెల్లూరు: ధైర్య సాహసాల పోలీస్ అధికారి ఇక లేరు

పోలీస్ విధి నిర్వహణలో ధైర్య సాహసాలు, నిజాయితీ గల విశ్రాంత అడిషనల్ ఎస్పీ భోగాది పృథ్వీ నారాయణ తుది శ్వాస వదిలారు. గతంలో నెల్లూరు నగర సీఐగా పనిచేశారని పోలీస్ సంఘం నాయకులు శ్రీహరి తెలిపారు. విధి నిర్వహణలో నిజాయితీపరుడని, ధైర్య సాహసాలు కలిగిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.