News March 3, 2025
తిరుపతి జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

✒ తిరుపతిలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సం. పరీక్షలు
✒ తిరుపతి: 20ఏళ్ల యువకుడికి గుండె ఆపరేషన్.. సక్సెస్
✒ తిరుపతి: బలిజపల్లిలో పూరిల్లు దగ్దం
✒ పెద్దిరెడ్డి వల్లే రోడ్లు ఆగిపోయాయి: MLA కోనేటి
✒ గొట్టిప్రోలు టీచర్‌కు బెస్ట్ టీచర్‌గా అవార్డు
✒ తిరుపతి: టీటీడీకి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల విరాళం
✒ పుత్తూరులో చైన్ స్నాచర్ అరెస్ట్
Similar News
News January 8, 2026
తీగ చిక్కుడులో ఆముదం మొక్కలతో ఏమిటి ప్రయోజనం?

తీగ చిక్కుడు పంటను సాగు చేసే కొందరు రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఆముదం మొక్కలను తీగ చిక్కుడు పంటలోని ప్రతి ఆరు అడుగులకు ఒకటి చొప్పున నాటుతున్నారు. దీని వల్ల చీడపీడల సమస్య తగ్గడంతో పాటు ఆముదం మొక్కలు పెరిగాక వాటి ఆకులు తీగ చిక్కుడుకు షేడ్నెట్లా పనిచేస్తున్నాయి. ఫలితంగా చిక్కుడు పంటపై ఎండ తీవ్రత తగ్గి మంచి దిగుబడి వస్తోందని, ఈ పద్ధతిని అనుసరిస్తున్న రైతులు చెబుతున్నారు.
News January 8, 2026
నేటి యువతను వేధిస్తున్న మానసిక జబ్బు ఇదే!

ఏకాగ్రత లేక పనులు వాయిదా వేస్తూ గందరగోళానికి గురవుతున్నారా? అయితే మీరు ‘బ్రెయిన్ ఫాగ్’ బారిన పడినట్లే. నిద్రలేమి, స్క్రీన్ టైమ్ పెరగడం, పోషకాహార లోపం, మద్యం సేవించడం వల్ల తలెత్తే ఈ సమస్య నేటి యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే చిట్కాలు నమ్మొద్దని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన నిద్ర, వ్యాయామం, పోషకాహారం తీసుకోవాలని అవసరమైతేనే డాక్టర్ వద్దకు వెళ్లాలంటున్నారు.
News January 8, 2026
BREAKING: పటాన్చెరులో భారీ అగ్ని ప్రమాదం

పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లోని ఓ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫర్నిచర్ అంతా తగలబడి, దట్టమైన నల్లటి పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.


