News March 3, 2025
రోహిత్‌పై వ్యాఖ్యలా.. దేశం వదిలిపోండి: యువరాజ్ తండ్రి

రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన షామా మహమ్మద్‌పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మండిపడ్డారు. ‘దేశానికి గర్వకారణమైన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్లు సిగ్గుపడాలి. వారికి మన దేశంలో బతికే హక్కు లేదు. క్రికెట్ మా మతం. ఇలాంటి మాటల్ని సహించేది లేదు. నేనే ప్రధానమంత్రినైతే ఆమెను వెంటనే బ్యాగ్ సర్దుకుని దేశం విడిచిపొమ్మని ఆదేశించి ఉండేవాడిని’ అని పేర్కొన్నారు.
Similar News
News March 4, 2025
వేలం తొలి రౌండ్‌లో అన్‌సోల్డ్.. ఇప్పుడు కెప్టెన్

IPL టీమ్ కేకేఆర్ తమ జట్టు కెప్టెన్‌గా అజింక్యా రహానేను నియమించింది. కాగా దుబాయ్‌లో జరిగిన మెగా వేలంలో రహానేను తొలుత ఎవరూ కొనుగోలు చేయలేదు. కనీస ధర రూ.కోటికి కూడా అతడిని సొంతం చేసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. రహానే నిదానమైన ఆట IPLకు సరిపోవడం లేదని ఎవరూ అతడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత జరిగిన యాక్సలరేటెడ్ రౌండ్‌లో ఆయనను KKR రూ.1.50 కోట్లతో దక్కించుకుని కెప్టెన్సీ అప్పగించింది.
News March 4, 2025
ఇండియాలో మాత్రం బికినీ వేసుకోను: సోనాక్షి సిన్హా

ఇండియాలో తాను ఎట్టి పరిస్థితుల్లో బికినీ వేసుకోనని హీరోయిన్ సోనాక్షి సిన్హా అన్నారు. ఇక్కడ ఎవరు ఏ వైపు నుంచి ఫొటో తీస్తారో తెలియదని చెప్పారు. అందుకే వేరే దేశం వెళ్లినప్పుడు బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తానని పేర్కొన్నారు. దీనిపై కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలవగా ఆ ఫొటోలు నెట్టింట ఎందుకు షేర్ చేస్తున్నావు? అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
News March 4, 2025
భవన నిర్మాణదారులకు శుభవార్త

AP: ఐదంతస్తుల లోపు లేదా 18 మీటర్లలోపు భవన నిర్మాణ అనుమతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. టౌన్‌ప్లానింగ్ అధికారుల అనుమతి అవసరం లేదని తెలిపింది. రిజిస్టర్డ్ LPTలు, ఇంజినీర్ల సమక్షంలో సరైన పత్రాలు సమర్పించి అఫిడవిట్‌లు ఇవ్వాలంది. ఈ మేరకు APDPMS పోర్టల్‌లో ఆప్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు.