News March 3, 2025

ఖమ్మం: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.

Similar News

News March 4, 2025

ఎర్రుపాలెం: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

image

ఎర్రుపాలెం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కోగంటి సాయిరాం (29) ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి తల్లి రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.

News March 4, 2025

పులిగుండాల ప్రాంతంలో రూఫస్ బెల్లిడ్ ఈగల్ ప్రత్యక్షం

image

పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు ప్రాంతంలో అరుదైన ఆసియా డేగ కెమెరాల్లో చిక్కింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఆసియా ప్రాంతానికి చెందిన వేటాడే పక్షి రూఫస్ బెల్లిడ్ ఈగల్‌గా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ విలక్షణమైన పక్షి తల, మెడ, రెక్కలు, వీపు, తోక స్లాటీ నల్లగా ఉంది. దాదాపు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఈ పక్షి ఇక్కడ కనిపించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News March 4, 2025

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు 

image

యాసంగి పంటలను సంరక్షించేలా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, గురుకులాల్లో రెగ్యులర్‌గా తనిఖీలు, ప్లాస్టిక్ ఫ్రీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.

error: Content is protected !!