News March 3, 2025

WGL: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.

Similar News

News November 8, 2025

లాలూ 7 జన్మలెత్తినా మోదీ కాలేరు: అమిత్ షా

image

ఏడు జన్మలెత్తినా లాలూ ప్రసాద్ యాదవ్ చేసినట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ కుంభకోణాలు చేయలేరని కేంద్ర మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. రైల్వేకు లాలూ తీసుకొచ్చిన లాభాలను మోదీ ఎన్నటికీ తీసుకురాలేరన్న తేజస్వీ యాదవ్ కామెంట్లకు షా కౌంటరిచ్చారు. బిహార్‌లోని పూర్ణియాలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అక్రమ వలసదారులను గుర్తిస్తామని, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి దేశం నుంచి పంపిస్తామని చెప్పారు.

News November 8, 2025

రేపు రాజమండ్రిలో ఉద్యోగమేళా

image

మెప్మా, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 9న (ఆదివారం) రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు శనివారం తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ నుంచి పీజీ, బీటెక్, నర్సింగ్ చేసిన వారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

News November 8, 2025

టెక్సాస్‌లో కారంచేడు విద్యార్థిని మృతి

image

కారంచేడుకు చెందిన యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) టెక్సాస్ A&M యూనివర్సిటీలో ఇటీవల పట్టా పొంది తన కుటుంబ సభ్యులకు అండగా నిలవాలన్న కల నెరవేరకముందే శుక్రవారం ఆకస్మికంగా కన్ను మూసింది. రాజ్యలక్ష్మి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తనది వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు గో ఫండ్ మీ ద్వారా స్నేహితులు సహాయం కోసం ముందుకు వచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.