News March 3, 2025
WGL: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.
Similar News
News March 4, 2025
వేలం తొలి రౌండ్‌లో అన్‌సోల్డ్.. ఇప్పుడు కెప్టెన్

IPL టీమ్ కేకేఆర్ తమ జట్టు కెప్టెన్‌గా అజింక్యా రహానేను నియమించింది. కాగా దుబాయ్‌లో జరిగిన మెగా వేలంలో రహానేను తొలుత ఎవరూ కొనుగోలు చేయలేదు. కనీస ధర రూ.కోటికి కూడా అతడిని సొంతం చేసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. రహానే నిదానమైన ఆట IPLకు సరిపోవడం లేదని ఎవరూ అతడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత జరిగిన యాక్సలరేటెడ్ రౌండ్‌లో ఆయనను KKR రూ.1.50 కోట్లతో దక్కించుకుని కెప్టెన్సీ అప్పగించింది.
News March 4, 2025
సంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు

సంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట మార్గాల్లో ఈ బస్సులు నడుపుతామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 4, 2025
పేదరిక జిల్లాగా ఉమ్మడి అనంతపురం

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో అనంతపురం జిల్లా 6వ స్థానంలో ఉంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిన్న సోషియో ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ప్రకారం గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. కాగా అత్యంత పేదరిక జిల్లాగా మొదటి స్థానంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నిలిచింది.