News March 3, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

✷ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం ✷ ద్వారకాతిరుమల సిబ్బంది నిజాయితీ ✷ దెందులూరు మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత✷ సామాన్య కుటుంబాల నుంచి ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన యువత✷ మానవత్వం చాటుకున్న మంత్రి పార్థసారథి ✷అసెంబ్లీలో గళం విప్పిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు
Similar News
News March 4, 2025
కాల్వ శ్రీరాంపూర్: ఇంట్లో బంగారం చోరీ కలకలం

కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లి గ్రామానికి చెందిన మద్దెల కాంతమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో చోరీ కలకలం రేపుతోంది. తమ వీధిలో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో బీరువా లాకరు ధ్వంసం చేసి 9 తులాల బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి ఎస్ఐ వెంకటేష్ చేరుకొని పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నారు.
News March 4, 2025
ఈనెల 8న మార్కాపురం రానున్న చంద్రబాబు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ఈనెల 8న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం రానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సమాచారం జిల్లా కలెక్టరేట్‌కి అందింది. ఈ నేపథ్యంలో మంగళవారం పూర్తి వివరాలు అందనున్నాయి. అయితే గత సంవత్సరం కూడా ఈ వేడుకలను చంద్రబాబు మార్కాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. దరిమడుగు లేదా ఎస్వీకేపి కళాశాలలో కానీ భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది.
News March 4, 2025
నేడూ పెన్షన్ల పంపిణీ

AP: పెన్షన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ కారణాలతో ఈ నెల పెన్షన్ తీసుకోని వారికి ఇవాళ కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. అనంతపురం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్, కర్నూలు, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని లబ్ధిదారులకు ఈ అవకాశం ఉంటుందని తెలిపింది.