News March 4, 2025
ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ మృతి

ముంబై లెజెండరీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్(84) కన్నుమూశారు. వృద్ధాప్యంతో ఆయన తుది శ్వాస విడిచారు. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 589 వికెట్లు పడగొట్టారు. పదకొండు సార్లు 10 వికెట్ల ఘనత సాధించారు. 12 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన పద్మాకర్ 16 వికెట్లు తీశారు. 2017లో సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.
Similar News
News March 4, 2025
ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సహాయం నిలిపివేత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేశారు. రష్యాతో శాంతి విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహకరించడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆ దేశానికిచ్చే సాయాన్ని ఆయన సమీక్షిస్తున్నారని శ్వేతసౌధం పేర్కొంది. ‘అధ్యక్షుడి దృష్టంతా శాంతిస్థాపన మీదే ఉంది. రష్యా-ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తున్నారు’ అని తెలిపింది.
News March 4, 2025
హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణలో ముందడుగు

హైదరాబాద్-విజయవాడ NH-65 రహదారి 6 లేన్ల విస్తరణ విషయంలో కీలక ముందడుగు పడింది. డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(DPR) రూపొందించే బాధ్యతల్ని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సంస్థ దక్కించుకుంది. ఈ నెలాఖరుకల్లా ఈ సంస్థతో కేంద్రం ఒప్పందం ఖరారు కానుంది. డీపీఆర్ తయారీకి రూ.9.86 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. TGలోని దండు మల్కాపూర్ నుంచి APలోని గొల్లపూడి వరకు 265 కి.మీ మేర హైవే విస్తరణ జరగనుంది.
News March 4, 2025
అచ్చెన్న మద్దతిచ్చారా.. నాకు తెలియదే: ఎమ్మెల్సీ గాదె

AP: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా తాము మద్దతిచ్చిన వ్యక్తే గెలిచారంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన <<15643983>>వ్యాఖ్యలపై<<>> గాదె శ్రీనివాసులు నాయుడు స్పందించారు. ‘అవునా.. అచ్చెన్న నాకు మద్దతిచ్చారా? నాకు దానిపై అవగాహన లేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాత్రమే నేను గెలిచా’ అని స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతలు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిన రఘువర్మ ఓడిపోయిన విషయం తెలిసిందే.