News March 22, 2024

ఒత్తిడితో సమస్యలు ఇంతింత కాదయా..

image

ఈ డిజిటల్ యుగంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఒత్తిడి. ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో సమస్యలతో తరచూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది ఫిజికల్, మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పి, అలసట, అజీర్తి, BP, షార్ట్ టెంపర్, వాయిదా వేయడం, నిర్లక్ష్యం ఆవహించడం వంటి సమస్యలు చుట్టుముడతాయట. ప్రెజర్ మేనేజ్‌మెంట్ చేసుకోలేకపోతే ఇవి దీర్ఘకాలిక సమస్యలుగా వేధిస్తాయంటున్నారు.

Similar News

News February 25, 2025

‘ఛావా’ కలెక్షన్ల దండయాత్ర

image

బాక్సాఫీస్ వద్ద ‘ఛావా’ మూవీ దండయాత్ర కొనసాగుతోంది. విడుదలైన 11 రోజుల్లో ఈ సినిమా భారతదేశంలో రూ.353.61 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న ఒక్క రోజే రూ.20 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు వెల్లడించాయి. మరాఠా యోధుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ లీడ్ రోల్‌లో నటించారు.

News February 25, 2025

జియో హాట్‌స్టార్‌కు పోటీగా.. ఎయిర్‌టెల్, టాటాప్లే జింగాలాలా..

image

జియో హాట్‌స్టార్ తర్వాత మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగంలో మరో 2 కంపెనీలు విలీనం కాబోతున్నట్టు తెలిసింది. స్వాప్‌డీల్ ద్వారా భారతీ ఎయిర్‌టెల్ తమ DTH బిజినెస్ ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీని టాటా ప్లేతో మెర్జ్ చేయనుందని సమాచారం. ఎయిర్‌టెల్ 52-55%, టాటా 45-48% వాటా తీసుకుంటాయని తెలిసింది. ఇదే జరిగితే టాటా ప్లే‌కు ఉన్న 1.9 కోట్ల హోమ్స్, 5 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఎయిర్‌టెల్ పరిధిలోకి వస్తాయి.

News February 25, 2025

మోడల్ స్కూల్ దరఖాస్తుల గడువు పెంపు

image

TG: మోడల్ స్కూళ్ల దరఖాస్తు గడువును మార్చి10వ వరకు పెంచినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈనెల 28వ తేదీతో గడువు ముగుస్తుండగా మార్చి10 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం GO జారీ చేసింది. మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫీజు ఓసీలు రూ.200, ఇతర వర్గాల వారు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. సైట్: https://telanganams.cgg.gov.in/

error: Content is protected !!