News March 4, 2025
నిర్మల్: లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: ఎస్పీ

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ నెల 8న నిర్మల్, ఖానాపూర్, భైంసా కోర్టులలో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కేసులను రాజీ చేసుకోవాలన్నారు.
Similar News
News September 16, 2025
మహిళలకు ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

‘స్వస్త్ నారీ- స్వశక్తి పరివార్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. మహిళలకు రక్తహీనత, బీపీ, థైరాయిడ్, టీబీ పరీక్షలు నిర్వహించి, గర్భిణుకు ఆరోగ్య పరీక్షలు చేసి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించడమే ముఖ్య లక్ష్యమని వివరించారు.
News September 16, 2025
కడప: మెగా DSC.. 32 పోస్టులు ఖాళీ

మెగా DSCకి సంబంధించి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి కడప జిల్లాలో 712 పోస్టులకు గాను 680 పోస్టులు భర్తీ అయినట్లు విద్యాశాఖ తెలిపింది. వివిధ కారణాల చేత మిగిలిన పోయిన 32 పోస్టులను వచ్చే DSCలో చేర్చనున్నారు. ఈ నెల 19న ఎంపికైన వారికి నియామకపత్రాలు అందిస్తారు. శిక్షణ తర్వాత పాఠశాలలు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.
News September 16, 2025
గౌరవెల్లి పెద్దగుట్టలో చిరుత కలకలం..!

అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ శివారుల్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జక్కుల రాజు అనే రైతు పొలం వద్దకు వెళ్తుండగా చిరుతను చూసినట్లు తెలిపాడు. పొదల్లో దాగున్న పులి గట్టిగా గర్జిస్తూ కొండెంగను చంపి పట్టుకుందన్నారు. గత వారం గుట్టపైకి వెళ్లిన లేగ దూడలను తిన్న కళేబరాలు కనిపించాయని చెప్పాడు. దాంతో పశువుల కాపరులు ఆ వైపు వెళ్లడానికి భయపడుతున్నారు.