News March 4, 2025

సూర్యాపేట: అరుణాచల గిరి ప్రదక్షిణకు కోదాడ డిపో బస్సులు

image

తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం కోదాడ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్సు ఈనెల 11వ తేదీ సాయంత్రం 7గంటలకు కోదాడ నుంచి బయలుదేరి 12వ తేదీ ఉదయం కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ్నుంచి వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకొని రాత్రికి అరుణాచలం, 13న పౌర్ణమి గిరిప్రదక్షణ ఉంటుందని తెలిపారు.

Similar News

News January 24, 2026

విశాఖ రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కార్యాలయం మార్పు

image

విశాఖ రైల్వే స్టేషన్ వద్ద రిజర్వేషన్ కౌంటర్‌ను మార్చుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జనవరి 26 నుంచి ప్రస్తుత రిజర్వేషన్ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు చెప్పారు. జనవరి 27 నుంచి విశాఖ రైల్వే స్టేషన్ గేట్ నంబర్-2, నంబర్-3 మధ్యగల భవనంలో రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News January 24, 2026

విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు

image

రిపబ్లిక్ డే రద్దీ దృష్ట్యా విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. 08517 రైలు జనవరి 25న సాయంత్రం5.30కి విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15కి చర్లపల్లి చేరుతుంది. తిరుగుపయనంలో 08518 రైలు జనవరి 26న మధ్యాహ్నం 3.30కి చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ వస్తుంది. ఈ రైళ్లు దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా ప్రయాణిస్తాయి.

News January 24, 2026

కెనడాను చైనా మింగేస్తుంది: ట్రంప్

image

చైనాతో వ్యాపారం చేస్తే కెనడాకే ప్రమాదమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు మద్దతివ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కెనడా వ్యతిరేకిస్తోంది. నిజానికి అది వారి దేశాన్ని కూడా రక్షిస్తుంది. దానికి బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకే మొగ్గు చూపుతోంది. నిజానికి కెనడాని చైనా ఏడాదిలోనే మింగేస్తుంది’ అని పేర్కొన్నారు.