News March 22, 2024
విపరీతమైన ఎండలు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
✒ ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
✒ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
✒ శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు.
✒ బయటకు వెళ్తే తెలుపు రంగు దుస్తులను ధరించండి.
Similar News
News November 26, 2024
తిరుపతి జూలో 17 ఏళ్ల బెంగాల్ టైగర్ మృతి
AP: తిరుపతిలోని వెంకటేశ్వర జూపార్క్‌లో 17 ఏళ్ల బెంగాల్ టైగర్ మరణించింది. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన మధు అనే పెద్దపులి ఆరోగ్య సమస్యలతో చనిపోయినట్లు సిబ్బంది తెలిపారు. గత రెండు నెలలుగా ఈ టైగర్ ఎలాంటి ఆహారం తీసుకోవట్లేదని పేర్కొన్నారు. అవయవాలు దెబ్బతినడం వల్లే పులి మరణించినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో వెంకటేశ్వర జూపార్కులో మూడు టైగర్స్ చనిపోవడం గమనార్హం.
News November 26, 2024
గుజరాత్ పూర్తి జట్టు ఇదే
ఐపీఎల్ మెగా వేలం, రిటెన్షన్లతో కలిపి గుజరాత్ టైటాన్స్ 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టు: గిల్, రషీద్, బట్లర్, సుదర్శన్, తెవాటియా, షారుఖ్, రబాడ, సిరాజ్, సుందర్, ప్రసిద్ధ్, నిషాంత్, లామ్రోర్, కుషాగ్రా, రావత్, అర్షద్, సుతార్, కొయెట్జీ, గుర్నూర్, రూథర్‌ఫర్డ్, సాయికిశోర్, ఇషాంత్, జయంత్ యాదవ్, ఫిలిప్స్, కరీమ్ జనత్, కుల్వంత్.
News November 26, 2024
ఢిల్లీ క్యాపిటల్స్ ఫుల్ టీమ్ ఇదే
IPL-2025 రిటెన్షన్స్, మెగా వేలంతో కలిపి ఢిల్లీ క్యాపిటల్స్ 23 మందిని తీసుకుంది. జట్టు: కేఎల్ రాహుల్, బ్రూక్, డుప్లెసిస్, కుల్దీప్, పొరెల్, స్టార్క్, స్టబ్స్, మెక్‌గుర్క్, ముకేశ్, చమీర, నటరాజన్, నాయర్, ఫెరీరా, అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, అశుతోశ్ శర్మ, మోహిత్, దర్శన్ నాల్కండే, విప్రజ్, అజయ్ మండల్, త్రిపురాణ విజయ్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి.