News March 4, 2025
టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

టెక్కలి పోలీస్ స్టేషన్‌లో సోమవారం జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా తొలుత స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. నూతన మోటార్ వెహికల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సిబ్బందికి చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు, అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News July 4, 2025
ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

ఆమదాలవలస ( శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కు సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మధుసూదన రావు తెలిపారు. మృతుని వయసు 45 ఏళ్లు ఉండి, ఎర్రని బనియన్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9493474582 నంబరును సంప్రదించాలన్నారు.
News May 7, 2025
శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి అభినందనలు

నేడు సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన విజయవంతం చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం విశేష కృషిచేశారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. బుడగట్లపాలెం సముద్ర తీర ప్రాంతంలో అనువైన పరిస్థతిని కల్పించి మత్య్సకారులతో సీఎం నేరుగా మాట్లాడేందుకు అవకాశం దక్కిందన్నారు.
News May 7, 2025
పలాస: మృతదేహం కోసం ఐదు రోజులుగా ఎదురుచూపులు

ఉపాధి కోసం పోలాండ్ దేశానికి వెళ్లిన పలాస(M) ఖైజోల గ్రామానికి చెందిన బుడత దామోదర్(33) మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఈ నెల 21న మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. ఇప్పటికి 5 రోజులు గడిచినా మృతదేహం స్వగ్రామానికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తక్షణమే అధికారులు, నాయకులు స్పందించి మృతదేహం స్వగ్రామానికి చేరేలా చర్యలు తీసుకోవాలని బంధువులు వేడుకుంటున్నారు.