News March 4, 2025
కాకినాడ: పార్సిల్ కార్యాలయాలపై పోలీసు దాడులు

కాకినాడలోని బాలాజీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో సోమవారం ఉదయం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని పార్సిల్ కార్యాలయాలలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయం వెల్లడించింది. అనుమానిత పార్సిల్ ఉంటే తమకు తెలియజేయాలని పోలీసులు సూచించారు.
Similar News
News March 4, 2025
నవరత్న కంపెనీలుగా IRCTC, IRFC

ప్రభుత్వ రంగ సంస్థలైన IRCTC, IRFCలకు నవరత్న హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, ఆదాయ-లాభాల ఆర్జన ఆధారంగా కేంద్రం కంపెనీలకు ఈ హోదా ఇస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి IRCTC రూ.4270 కోట్ల వార్షిక ఆదాయం, IRFC రూ.26,644 కోట్ల ఆదాయాన్ని సాధించాయి. తాజాగా రెండు కంపెనీలు చేరడంతో ఈ హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కు చేరుకుంది.
News March 4, 2025
దుబాయ్‌లో కామారెడ్డి జిల్లా వాసి మృతి

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నరేశ్ దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 3న నరేశ్ పని నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఫిబ్రవరి 24 నరేశ్ సూసైడ్ చేసుకున్నాడు. కాగా ఇవాళ ఉదయం డెడ్ బాడీ గ్రామానికి చేరుకుంది. నరేశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News March 4, 2025
కరీంనగర్: పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ అప్డేట్

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలో ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ఓట్లను లెక్కించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో సుమారు 21 వేల ఓట్లు చెల్లుబాటు కాలేదన్నారు. సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయని ఇంకా 40 వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు విభజన చేయాల్సి ఉందన్నారు. మంగళవారంఉదయం 10 గంటల నుంచి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు.