News March 22, 2024

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో చేరాం: చంద్రబాబు

image

AP: రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీఏలో చేరామని టీడీపీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రజాభిప్రాయం మేరకు రాష్ట్ర సమస్యలపై పోరాడే నేతలనే అభ్యర్థులుగా నిలబెడుతున్నామని చెప్పారు. వారిని ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఇప్పటి వరకు 139 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, మిగిలిన 5 MLA, 4 MP స్థానాలకు క్యాండిడేట్లను త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు.

Similar News

News July 9, 2025

తిరుమలలో మొదట ఎవరిని దర్శించుకోవాలంటే?

image

తిరుమల కొండపైకి చేరుకోగానే చాలా మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూ కడుతుంటారు. నిజానికి తిరుమల ఆదివరాహ క్షేత్రం. అందువల్ల తిరుమలకు వచ్చే భక్తులు తొలుత పుష్కరిణి పక్కనే ఉన్న వరాహ క్షేత్రాన్ని దర్శించుకోవాలనే ఆచారం ఉంది. ఈ విషయాన్ని ‘TTD అప్డేట్స్’ X వేదికగా పేర్కొంటూ భక్తులకు అవగాహన కల్పిస్తోంది. వెంకటేశ్వర స్వామి వాగ్దానం ప్రకారం.. వరాహ స్వామికి మొదటి పూజ, నైవేద్యం సమర్పిస్తారని ప్రతీతి.

News July 9, 2025

లార్డ్స్‌లో పరుగుల వరద కష్టమే?

image

టీమ్ఇండియా పరుగుల వరదకు అడ్డుకట్ట వేసేందుకు లార్డ్స్‌లో ‘గ్రాస్ టాప్ పిచ్’ రెడీ చేసినట్లు తెలుస్తోంది. పిచ్ మీద గ్రాస్ ఎక్కువుంటే బ్యాటింగ్ కష్టమవుతుంది. ముఖ్యంగా పేసర్లకు పిచ్ సహకరించే అవకాశం ఎక్కువ. మూడో టెస్టులో ఇంగ్లండ్‌ బౌలర్లు ఆర్చర్, అట్కిన్‌సన్ ఉండే అవకాశాలున్నాయి. వారికి ఈ పిచ్ అనుకూలంగా ఉండొచ్చు. అయితే, ఆకాశ్ దీప్ ఫామ్‌లో ఉండటం, బుమ్రా కంబ్యాక్ టీమ్ఇండియాకి కూడా కలిసొచ్చే ఛాన్సుంది.

News July 9, 2025

32.39 కోట్ల మంది ఖాతాల్లో PF వడ్డీ జమ

image

EPFO ఖాతాల్లో 2024-25 సంవత్సరానికి 8.25శాతం <<16951029>>వడ్డీని <<>>కేంద్రం జమ చేస్తోంది. 33.56 కోట్ల మంది సభ్యులకు సంబంధించి 13.55 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల మంది ఖాతాల్లో వడ్డీ జమ ముగిసినట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. మిగతా వారికి కూడా ఈ వారంలోనే జమ చేస్తామని తెలిపారు. గత ఏడాది ఆగస్టు-డిసెంబర్ మధ్య వడ్డీ జమ జరగ్గా, ఈ సారి జులైలోనే పూర్తికానుంది. మీ PF ఖాతాల్లో వడ్డీ జమ అయ్యిందా?