News March 4, 2025
మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి: షాజహాన్ బాషా

మదనపల్లెలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం అసెంబ్లీ వేదికగా స్పీకర్‌ను కోరారు. ఇది నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. 1860 నుంచి మదనపల్లె పరిపాలన రాజధానిగా గుర్తింపు పొందిందన్నారు. ఆటోనగర్, ఐటి కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని సీఎంను కోరారు.
Similar News
News July 6, 2025
JNTU: ఈ ఏడాది నుంచి 164 క్రెడిట్స్ అమలు

2025-26 విద్యా సంవత్సరానికి గాను జేఎన్టీయూ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతి సంవత్సరం 160 క్రెడిట్స్ వస్తేనే పట్టా ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 164 క్రెడిట్స్‌కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వాటిలో 4 మినహాయించి 160 క్రెడిట్స్ వస్తేనే డిగ్రీ అందజేయనున్నారు. ఏదైనా కారణాలతో బీటెక్‌ను వదిలేస్తే కోర్సు పూర్తి చేసేందుకు 8 ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
News July 6, 2025
గజ్వేల్: వృద్ధురాలిని చంపిన వ్యక్తి అరెస్టు

వృద్ధురాలిని హత్య చేసి బంగారు, వెండి వస్తువులను దొంగలించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింలు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కోమటిపల్లికి చెందిన కిచ్చిగారి శివశంకర్(36)ను వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. గత నెల 26న ధర్మారెడ్డిపల్లికి చెందిన నల్ల సత్తెమ్మను కొడవలితో నరికి చంపి మెడలోని బంగారు చైన్, చెవి కమ్ములను అపహరించుకుపోయినట్లు ఏసీపీ వివరించారు.
News July 6, 2025
గూగూడులో శ్రీకుళ్లాయిస్వామికి 28 కేజీల వెండి గొడుగు

నార్పల మండలంలోని గూగూడులో వెలిసిన శ్రీకుళ్లాయిస్వామికి 28 కేజీలు వెండి గొడుగు దేవస్థానం అధికారులు చేయించారు. ఈ సందర్భంగా వెండి గొడుగును దేవస్థానం అగ్నిగుండం చుట్టూ ఊరేగించారు. వెండి గొడుగులు తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆసక్తి కనబరిచారు. దేవస్థానానికి ప్రతి ఏటా పెద్ద ఎత్తున వెండిని భక్తులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.