News March 4, 2025
నల్గొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో భరోసా కన్వర్జెన్ మీటింగ్

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు తీసుకోవాల్సిన తక్షణ సహాయక చర్యలపై లీగల్, మెడికల్, ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ సంబంధిత అధికారులతో జిల్లా SP శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో భరోసా కన్వర్జెన్ మీటింగ్‌ను సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్ జడ్జి కులకర్ణి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ దీప్తి పాల్గొన్నారు.
Similar News
News March 4, 2025
ఇంటర్ విద్యార్థులకు డీఐఈఓ కీలక సూచన

నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఐఈఓ దస్రు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 4, 2025
NLG: టీచర్ MLC ఎన్నికలు.. ‘ఏక్’ నిరంజన్!

NLG – KMM – WGL టీచర్ MLC ఎన్నికల ఫలితాల్లో ఓ అభ్యర్థి ఒకటే ఓటు వచ్చింది. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో బంకా రాజు-7, కంటె సాయన్న-5, చలిక చంద్రశేకర్-1 సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితమయ్యారు. కాగా.. మరో ఆరుగురు తాటికొండ వెంకటయ్య-39, జంగిటి కైలాసం-26, పన్నాల గోపాల్‌రెడ్డి-24, అర్వ స్వాతి-20, లింగిడివెంకటేశ్వర్లు-15, పురుషోత్తంరెడ్డి-11 డబుల్ డిజిట్ ఓట్లతో సరిపెట్టుకున్నారు.
News March 4, 2025
నల్గొండ: కోదండరామ్ మద్దతిచ్చిన వ్యక్తికి 24 ఓట్లు

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోదండరాం మద్దతు ఇచ్చిన పన్నాల గోపాల్ రెడ్డికి 24 ఓట్లు రావడంతో కోదండరామ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రచారం చేస్తే 24 ఓట్లు రావడం ఏంటని మేధావులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.