News March 4, 2025
కొత్తగూడెం: ఆన్లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపు

విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుపై జిల్లా కలెక్టర్లతో, విద్యాశాఖ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీవోసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ట్రెజరీ ద్వారా బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం అవుతోందని, నేరుగా ఆన్లైన్ నుంచే మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించేందుకు విద్యాశాఖ పరిశీలిస్తుందని అన్నారు.
Similar News
News March 4, 2025
ఉద్యోగులను రోబోలనుకున్నారా?: అఖిలేశ్

యువత, ఉద్యోగులు వారానికి 70-90 గంటల పాటు <<15638083>>పనిచేయాలని <<>>కోరుతున్న పారిశ్రామికవేత్తలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఉద్యోగులను రోబోలుగా భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. పనిలో నాణ్యత ముఖ్యమని పేర్కొన్నారు. ఎక్కువ గంటలు పనిచేయాలంటున్న వారు యువకులుగా ఉన్నప్పుడు అన్ని గంటలు పనిచేశారా? అని నిలదీశారు. పని గంటల పొడిగింపుతో కలిగే ఆర్థిక ప్రగతి సామాన్యులకు ఏం ఒరగబెడుతుందని ప్రశ్నించారు.
News March 4, 2025
HYDలో శిరీషను చంపి డ్రామా!

మలక్‌పేట జమున టవర్స్‌లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్‌పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News March 4, 2025
పరీక్ష సమయాల్లో ట్రాఫిక్ సమస్య రానియద్దు: వరంగల్ సీపీ

రేపటి నుంచి ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య రాకుండా ట్రాఫిక్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు సైతం ముందస్తూ చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రధానంగా విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేందుకు పోలీసులు తమ వంతు సహకారాన్ని అందజేయాలని సూచించారు.