News March 4, 2025
యుద్ధం ముగింపు ఇప్పట్లో లేనట్లే: జెలెన్‌స్కీ

రష్యాతో యుద్ధ ముగింపు ఇప్పట్లో కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. అగ్రరాజ్యం అమెరికా నుంచి తమకు మద్ధతు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘యూఎస్‌తో మా బంధం ఇప్పటిది కాదు. అందుకే మా సంబంధం కొనసాగుతుందని భావిస్తున్నా. అమెరికాతో డీల్‌కు మేం సిద్ధం. ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ అమెరికాకు రుణపడి ఉంటారు. ఇందులో సందేహమే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News March 4, 2025
రజినీపై విచారణ.. అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ

AP: మాజీ మంత్రి విడుదల రజినీపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. ఐపీఎస్ జాషువాతో కలిసి స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. విచారణకు అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ రాసింది. గ్రీన్ సిగ్నల్ రాగానే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం కేసు నమోదు చేయనున్నారు.
News March 4, 2025
ట్రంప్ టారిఫ్ నిబంధనలు.. స్టాక్ మార్కెట్లలో కలకలం

మెక్సికో, కెనడాపై తాము విధించిన సుంకాల్లో ఎటువంటి మార్పూ ఉండదని, నేటి నుంచి అమల్లోకి వస్తాయని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదుపులకు లోనయ్యాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఇక భారత్‌లో నిఫ్టీ ఒకశాతం తక్కువగా మొదలయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్ల ప్రభావం ఎలా ఉండనుందన్న కోణంలో మదుపర్లు ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది.
News March 4, 2025
నేడూ పెన్షన్ల పంపిణీ

AP: పెన్షన్‌దారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ కారణాలతో ఈ నెల పెన్షన్ తీసుకోని వారికి ఇవాళ కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. అనంతపురం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్, కర్నూలు, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని లబ్ధిదారులకు ఈ అవకాశం ఉంటుందని తెలిపింది.