News March 4, 2025
మార్చి 04: చరిత్రలో ఈ రోజు

1886: స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి జననం
1961: భారత మొదటి విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ ప్రారంభం
1966: భారత జాతీయ భద్రతా దినోత్సవం
1973: డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి జననం
1980: టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం
1984: సినీ నటి కమలినీ ముఖర్జీ జననం
1987: నటి శ్రద్ధా దాస్ జననం
Similar News
News March 4, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ మరో సంచలనం

టీవీలు, ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వచ్చేసినప్పటికీ థియేటర్లలో మూవీ హవా తగ్గలేదు. నేటితో 92 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఒక రీజినల్ మూవీ విభాగంలో ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
News March 4, 2025
ఉద్యోగులను రోబోలనుకున్నారా?: అఖిలేశ్

యువత, ఉద్యోగులు వారానికి 70-90 గంటల పాటు <<15638083>>పనిచేయాలని <<>>కోరుతున్న పారిశ్రామికవేత్తలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఉద్యోగులను రోబోలుగా భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. పనిలో నాణ్యత ముఖ్యమని పేర్కొన్నారు. ఎక్కువ గంటలు పనిచేయాలంటున్న వారు యువకులుగా ఉన్నప్పుడు అన్ని గంటలు పనిచేశారా? అని నిలదీశారు. పని గంటల పొడిగింపుతో కలిగే ఆర్థిక ప్రగతి సామాన్యులకు ఏం ఒరగబెడుతుందని ప్రశ్నించారు.
News March 4, 2025
PAYTMకు మరో షాక్

పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. రూ.611 కోట్లకు సంబంధించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలడంతో ఈ నోటీసులు జారీ చేసింది. సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టి, విదేశాల్లో సబ్సిడరీ ఏర్పాటు విషయాన్ని RBIకి పేటీఎం వెల్లడించలేదని ED నిర్ధారించింది. సంస్థ ఛైర్మన్ విజయ్ శేఖర్‌కూ నోటీసులు పంపింది. దీంతో సంస్థ షేర్లు 4శాతం పడిపోయాయి.