News March 4, 2025
VKB: 153 వాహనాలు సీజ్.. రూ.46,62,375 టాక్స్ వసూలు

జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖలో ఫిబ్రవరి 2025 సంవత్సరం ఒక్క నెలకి గాను ట్యాక్స్ చెల్లించని 153 వాహనాలను సీజ్ చేసి రూ.46,62,375 రూపాయల జరిమానాను ఒక్క నెలలోనే వసూలు చేసినట్లు వికారాబాద్ జిల్లా రవాణా అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇంకా ట్యాక్స్ చెల్లించని వాహనదారులు ఆన్‌లైన్‌లో లేదా మీసేవా ద్వారా ట్యాక్స్ చెల్లించాలని ఆయన తెలిపారు. ట్యాక్స్ చెల్లించని వాహనాలను సీజ్ చేస్తామన్నారు.
Similar News
News March 4, 2025
పార్వతీపురం: ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 562 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 562 గైర్హాజరు అయినట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా మంగళవారం 34 పరీక్ష కేంద్రాల్లో 9,437 మంది విద్యార్థులకు గాను 8,875 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 6,488 మంది జనరల్ విద్యార్థులకు 6,243 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,949మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 2,632 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
News March 4, 2025
రాచర్ల: వృద్ధురాలికి షాక్ ఇచ్చిన కరెంట్ బిల్.!

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పలుగూటిపల్లికి చెందిన పూల వెంకటమ్మ అనే వృద్ధురాలికి కరెంట్ బిల్ షాక్ ఇచ్చింది. ఇంట్లో కేవలం 3 ఫ్యాన్లు, ఓ ఫ్రిడ్జ్, ఓ TV ఉండగా ఏకంగా రూ.10,580 బిల్లు రావడంతో ఆమె అవాక్కయ్యారు. ఫిబ్రవరి నెలలో వారం రోజులపాటు అసలు ఊరిలోనే లేనని, అయినా ఇంత కరెంట్ బిల్లు ఎలా వచ్చిందో తెలియలేదని ఆమె తెలిపారు. గతంలో కూడా మీటర్ సాంకేతిక లోపంతో లక్ష వరకు కరెంట్ బిల్ వచ్చిందని వెల్లడించించారు.
News March 4, 2025
వారికి ప్రభుత్వ పథకాలు కట్?

AP: గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను నిలిపేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. త్వరలోనే క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపాయి.