News March 4, 2025

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు?

image

AP: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి జనసేన తరఫున నాగబాబుకు ఖరారైనట్లు సమాచారం. కాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు కూడా ఆయనను మంత్రిమండలిలోకి తీసుకుంటామని ప్రకటించారు.

Similar News

News March 4, 2025

టీమ్ ఇండియా ఆందోళనంతా అతడి గురించే: DK

image

టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియా జట్టుతో భయం లేదు కానీ మానసికంగా ట్రావిస్ హెడ్ అనే అడ్డంకి ఆటగాళ్ల మైండ్‌లో ఉంటుందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అంచనా వేశారు. ‘గతంలో నాకౌట్ గేమ్స్‌లో న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు ఇలాంటి భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడుతోంది. హెడ్ వికెట్ తీస్తే భారత్ ఊపిరి పీల్చుకోవచ్చు’ అని DK పేర్కొన్నారు.

News March 4, 2025

సిరాజ్‌తో డేటింగ్ చేయట్లేదు: మహీరా శర్మ

image

IND క్రికెటర్ సిరాజ్‌తో <<15305689>>డేటింగ్ వార్తలను<<>> బాలీవుడ్ నటి మహీరా శర్మ ఖండించారు. తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ ఎవరితోనైనా సంబంధం కలిపేస్తారని, వాటిని ఆపలేమని పేర్కొన్నారు. ‘కో స్టార్లతో రిలేషన్‌ ఉందంటారు. ఎడిటెడ్ ఫొటోలను SMలో పోస్టు చేస్తారు. వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. ఇటీవల ఆమె తల్లి సానియా శర్మ కూడా డేటింగ్ వార్తలను కొట్టిపారేశారు.

News March 4, 2025

“నాటు”ని బీట్ చేసేలా ఎన్టీఆర్-హృతిక్ డాన్స్?

image

వార్-2 మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్-హృతిక్ రోషన్‌లతో ఒక భారీ సాంగ్ షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరి స్టెప్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయన్నారు. క్లైమాక్స్ ఫైట్‌కు ముందు వచ్చే ఈ పాటని 500 మందితో డ్యాన్సర్లతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రీతమ్ మ్యూజిక్‌ అందించగా బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ‘RAW’ ఏజెంట్‌గా నటిస్తున్నారు.

error: Content is protected !!