News March 4, 2025
నల్గొండ: కోదండరామ్ మద్దతిచ్చిన వ్యక్తికి 24 ఓట్లు

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోదండరాం మద్దతు ఇచ్చిన పన్నాల గోపాల్ రెడ్డికి 24 ఓట్లు రావడంతో కోదండరామ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రచారం చేస్తే 24 ఓట్లు రావడం ఏంటని మేధావులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.
Similar News
News March 4, 2025
NLG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ‘సారీ’!

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. అంతేకాదు గత నాలుగు పర్యాయాలుగా ఒకసారి గెలిచిన అభ్యర్థిని / సంఘాన్ని వరుసగా రెండోసారి ఉపాధ్యాయులు గెలిపించడం లేదు. దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ 2007లో శాసనమండలిని పునరుద్ధరించారు. అప్పుడు మొదటిసారి నిర్వహించిన WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త చుక్కా రామయ్య యూటీఎఫ్ తరఫున విజయం సాధించారు.
News March 4, 2025
NLG: ఆన్లైన్లో ఇంటర్ హాల్ టికెట్లు

ఇంటర్ విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావొచ్చని జిల్లా ఇంటర్ విద్యా అధికారి దస్రునాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో తీసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకుండానే పరీక్షలు రాయవచ్చని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్ల మంజూరులో జాప్యం చేసినా, కేంద్రాల్లో సమస్యలు ఉన్నా డీఐఈవో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News March 4, 2025
NLG: హాస్టల్ పిల్లలకు నో చికెన్!

బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో సాధ్యమైనంతవరకు విద్యార్థులకు చికెన్ పెట్టవద్దని జిల్లా పరిధిలోని ఆయా హాస్టళ్ల వార్డెన్లకు పరోక్ష ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. దీంతో కొన్ని హాస్టళ్లలో విద్యార్థులకు చికెన్ పెట్టడం మానేశారు. కొన్ని హాస్టళ్లలో మాత్రం వార్డెన్లు చికెన్ వండి పెడుతున్నారని పలు హాస్టళ్ల సంక్షేమాధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై అధికారుల నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు.