News March 4, 2025
పించన్ల పంపిణీలో అల్లూరి జిల్లా ప్రథమ స్థానం

పెన్షన్ల పంపిణీలో అల్లూరి జిల్లా మళ్లీ ప్రథమ స్థానం సాధించిందని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం పాడేరు కలెక్టరేట్‌లో ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,22,907 మంది లబ్ధిదారులు ఉండగా 1,21,453 మందికి పంపిణీ చేసి 98.82 శాతంతో పంపిణీతో అల్లూరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గత ఆరు నెలలుగా వరుసగా మొదటి స్థానం సాధిస్తూ వస్తున్న జిల్లా 7వ సారి కూడా మొదటి స్థానంలో నిలవడంతో అధికారులను అభినందించారు.
Similar News
News November 9, 2025
రేపు క్యాబినెట్ భేటీ.. CII సమ్మిట్‌పై కీలక చర్చ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11గంటలకు క్యాబినెట్ భేటీ కానుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే CII సమ్మిట్ ప్రధాన ఎజెండాగా సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7,500 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అటు రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావం, పంట నష్టం అంచనాలు, రైతులకు అందించాల్సిన పరిహారంపై చర్చించనున్నారు.
News November 9, 2025
కురుమూర్తి జాతర పొడిగింపు

వర్షాభావం కారణంగా భక్తుల రాక తగ్గడంతో అమ్మపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో అలంకార దర్శనాలను నవంబర్ 17 వరకు పొడిగించారు. ఈ మేరకు పాలకమండలి ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి ప్రకటించారు. నవంబర్ 17న ఉదయం 10 గంటలకు అలంకారం తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
News November 9, 2025
ఈనెల 11న ములుగులో ‘ఐక్యత పాదయాత్ర’

‘ఏక్ భారత్ – ఆత్మ నిర్భర భారత్’ నినాదంతో ఈ నెల 11న ఉదయం ములుగులో జిల్లా స్థాయి ఐక్యత పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. యువతలో దేశభక్తి, ప్రజల్లో సమైక్యతను పెంచేందుకు ఈ యాత్రను చేపట్టారు. ఉదయం 9:30 గంటలకు ఫారెస్ట్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు జరిగే ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.


