News March 4, 2025

రాబోయే పది రోజులు అప్రమత్తంగా ఉండాలి: సీఎస్

image

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి యాసంగి పంటలకు నీరు సరఫరా, గురుకులల్లో రెగ్యులర్‌గా తనిఖీలు, ప్లాస్టిక్ ఫ్రీ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. రాబోయే పది రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని యాసంగి పంటల సంరక్షణ చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు.

Similar News

News September 19, 2025

కోకా‌పేట్‌లో భర్తను చంపిన భార్య

image

కోకాపేట్‌లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారు అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీశాయి.

News September 19, 2025

భద్రాచలం: ‘పద్ధతి మార్చుకోకపోతే మరణ శిక్ష తప్పదు’

image

మావోయిస్టు పార్టీపై పెత్తందారులు చేస్తున్న అసత్య ప్రచారం మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ మావోయిస్టు పార్టీ పేరుతో లేఖ విడుదలైంది. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాలకు చెందిన పలువురి పేర్లను ప్రస్తావిస్తూ ఇన్‌ఫార్మర్లుగా మారి తమను మాయ చేస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో మరణ శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ లేఖ సంచలనంగా మారింది.

News September 19, 2025

చిత్తూరు: టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కలేనా..?

image

చిత్తూరు జిల్లా టమాటా పంటకు పెట్టింది పేరు. ఆసియాలోనే అతి పెద్ద టమాటా మార్కెట్‌గా పేరు గడించింది. రోజుకు 1,500 టన్నుల పంటకు ఇక్కడ వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఇంత ఉన్నా రైతులు మాత్రం నష్టాలతో పంటను సాగు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పాలకులు టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా కార్యరూపం మాత్రం దాల్చ లేదు. ఇప్పటికైనా పాలకులు దీనిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.