News March 4, 2025
చిత్తూరు నగరంలో వ్యభిచార గృహంపై దాడి

చిత్తూరు నగరంలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. రామ్నగర్ కాలనీలో కొద్దిరోజులుగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమచారం రావడంతో 2టౌన్ CI నెట్టికంటయ్య తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం చేయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని, ముగ్గురు మహిళలతోపాటు ముగ్గురు విటులను స్టేషన్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 4, 2025
కార్వేటినగరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కార్వేటినగరం మండలం పళ్లిపట్టు మూడు రోడ్ల కూడలి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళత్తూరుకు చెందిన శ్రావణ్ కుమార్, చెన్నకేశవ అనే ఇద్దరు బర్త్ డే పార్టీకి వెళ్లి తిరిగి కార్వేటినగరం నుంచి బైక్పై వస్తూ డివైడర్ను ఢీకొన్నారు. ఈ ఘటనలో శ్రావణ్ కుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. చెన్నకేశవ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 4, 2025
తక్కువ పేదరికం ఉన్న జిల్లాలో చిత్తూరుకు ఐదో స్థానం

సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రంలోనే ఉమ్మడి చిత్తూరు (39 శాతం) జిల్లా తక్కువ పేదరికం ఉన్న జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. అలాగే అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంది. ఆ తర్వాత కడప, గుంటూరు, కృష్ణ జిల్లాలు నిలిచాయి. గిరిజనులు నివసించే అన్ని ప్రాంతాల్లో పేదరికం ఉన్నట్లు తెలిపింది.
News March 4, 2025
జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు: కుప్పం DSP

కుప్పం నియోజకవర్గ పరిధిలో జల్లికట్టు, ఎద్దుల పండుగ (మైలారు)ను నిషేధించినట్లు డీఎస్పీ పార్థసారధి స్పష్టం చేశారు. ఎక్కడైనా జల్లికట్టు, ఎద్దుల పండగను నిర్వహిస్తే వారు జంతు సంరక్షణ చట్టం క్రింద శిక్షార్హులన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSP హెచ్చరించారు.